న్యూఢిల్లీ, జూలై 29: పాము కాటు వల్ల దేశంలో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్సభలో వెల్లడించారు. ఈ తర హా మరణాలు ప్రపంచ దేశాలతో పో లిస్తే మన దేశంలోనే అత్యధికమన్నా రు. దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు పాముకాట్లపై ప్రభా వం చూపుతాయని.. ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ దాటి పెరిగితే ఈ ఘటనలు పెరుగుతాయని.. అయితే వీటిని నిరోధించవచ్చని వెల్లడించారు.