ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే (Narayan Rane) ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా ప్రతినిధి నుంచి మైక్ లాక్కున్నారు. అలాగే ఆదిత్య ఠాక్రే మద్దతుదారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో ఏర్పాటు చేసిన భారీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ప్రదేశాన్ని నారాయణ్ రాణే బుధవారం సందర్శించారు. అదే సమయంలో శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే కూడా అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా రాణే, ఆదిత్య ఠాక్రే మద్దతుదారులు వ్యతిరేక నినాదాలు చేసుకుని ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.
కాగా, ఈ గందరగోళాన్ని ఆపాలని పోలీసులతో రాణే అన్నారు. తనకు అనుమతి ఇచ్చిన సమయంలోనే ఆదిత్య ఠాక్రేకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీస్ అధికారులను ఆయన ప్రశ్నించారు. అలాగే దమ్ముంటే తనపై దాడి చేయాలని ఆదిత్య మద్దతుదారులకు సవాల్ చేశారు. అలా చేస్తే తాను ప్రతీకారం తీర్చుకుంటానని, ఎవరినీ విడిచిపెట్టబోనని బెదిరించారు. ఆదిత్య ఠాక్రే మద్దతుదారులను గదిలో బంధించి చంపేస్తానని రాణే వార్నింగ్ ఇచ్చారు. అలాగే తన సందర్శనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధి నుంచి మైక్ లాక్కొనేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
BJP ke Sanskar 👇
BJP MP Narayan Rane misbehaves and abuses a female journalist like a street side goon.
And these people lecture others over women safety, security and empowerment!
What an oxymoron!pic.twitter.com/Pr7Hh4lDFP
— Vinay Kumar Dokania (@VinayDokania) August 28, 2024
एकेकाला घरात घुसून मारेन: नारायण राणे यांची पोलिसांपुढेच महाविकास आघाडीच्या कार्यकर्त्यांना उघड धमकी; राजकोटावर राडा#NarayanRane #AdityaThackeray #NileshRane #Sindhudurghttps://t.co/PQLwzX58St pic.twitter.com/JMk4PdkH1t
— Divya Marathi (@MarathiDivya) August 28, 2024