ప్రస్తుతం యూపీలో ఎక్కడ చూసినా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. నిజానికి.. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ ర్యాలీలు, మీటింగ్లను ఎన్నికల కమిషన్ బ్యాన్ చేసింది. దీంతో ఓటరును ప్రసన్నం చేసుకోవడం కోసం నాయకులు ఏకంగా వాళ్ల ఇళ్లలోకే వెళ్లి తమకే ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
తాజాగా కాన్పూర్లోని గోవింద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర మియాథాని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశాడో తెలుసా? ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడి దగ్గరికి వెళ్లి అతడితో ముచ్చటించడం స్టార్ట్ చేశాడు.
ఆ వ్యక్తి స్నానం చేస్తున్నా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి సబ్బుతో శరీరానికి రుద్దుకుంటూనే సమాధానం చెప్పడం.. ఆ తర్వాత రేషన్ కార్డు ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించడం.. దీంతో ఉంది అని అతడు చెప్పడం.. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
जब नहाते हुए युवक से नेताजी ने मांगा वोट
— News24 (@news24tvchannel) January 13, 2022
कानपुर की गोविंदनगर सीट से BJP विधायक सुरेंद्र मैथानी का चुनाव प्रचार का वीडियो हुआ वायरल #UPElections2022 pic.twitter.com/AWqZpSk12z
వార్నీ.. స్నానం చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టరా? ఎన్నికలు ఉంటే ఇలా.. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ కనిపించరు కదా ఓటర్లకు.. అంటూ నెటిజన్లు ఆ ఎమ్మెల్యేకు కౌంటర్లు వేస్తున్నారు.
Is bande ko award do .
— Ivaan (@lyfis_memories) January 13, 2022
Itni thand mein naha raha hajn .
Make him MLA https://t.co/k6z1iR7h2R
Isse Achcha Samay aur kya hoga vote mangne ka? https://t.co/MrGCKlJ1OM
— The Great Harmonyyumm 💖 (@terrific_143) January 13, 2022
जब शौचालय में जाय तो कुंडी ढंग से लगाना ना भूलें।। https://t.co/pO0frzNv0s
— MOOLARAM JAJRA (@mularamjajra) January 13, 2022
क्या आपके टूथपेस्ट में नमक है? https://t.co/gg2A3zjJ6A
— Anupam <|> अनुपम (@ajnsit) January 13, 2022