Ram Mandhir | బీజేపీని కరుణించని అయోధ్య రామయ్య.. పని చేయని రామమందిర నినాదం
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ అంశం బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించలేదు.
- అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీకి తప్పని పరాభవం
లక్నో, జూన్ 4: భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ అంశం బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించలేదు. మందిర నిర్మాణం తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. నిజానికి, రామమందిర నిర్మాణం మొత్తం పూర్తి కాకముందే ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.
దేశమంతా హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచార అంశంగా మార్చుకుంది. అయితే, దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గిపోవడం చూస్తే రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీ ఆశించిన రాజకీయ ప్రయోజనం ఆ పార్టీకి దక్కనట్టు స్పష్టమవుతున్నది. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. ఆఖరికి రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- BJP
- Faizabad
- Lallu Singh
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

