దళితులపై దుర్మార్గం.. కర్ణాటకలో బీజేపీ నేత దౌర్జన్యం
కర్ణాటకలో దళితులపై అధికార బీజేపీ నేత అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకొని చెల్లించలేదన్న కక్షతో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ ఒకే గదిలో 15 రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఓ మహిళకు గర్భస్రావమైంది. చిక్‌మగళూరు జిల్లా జెన్నుగడ్డె గ్రామంలో చోటుచేసుకొన్న ఈ పాశవిక ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది
- ఒకే గదిలో 16 మంది నిర్బంధం
- తీవ్రంగా కొట్టడంతో మహిళకు గర్భస్రావం
- అప్పు చెల్లించనందుకు చిత్రహింసలు
చిక్‌మగళూరు, అక్టోబర్ 11: కర్ణాటకలో దళితులపై అధికార బీజేపీ నేత అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకొని చెల్లించలేదన్న కక్షతో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ ఒకే గదిలో 15 రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఓ మహిళకు గర్భస్రావమైంది. చిక్‌మగళూరు జిల్లా జెన్నుగడ్డె గ్రామంలో చోటుచేసుకొన్న ఈ పాశవిక ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మహిళను దవాఖానలో చేర్పించిన ఆమె బంధువులు.. జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేస్తేగానీ బాధితులకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించలేదు.
ఈ నెల 8వ తేదీనే బాధితుల బంధువులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, వారికి బెదిరింపులు రావటంతో ఫిర్యాదును ఉపసంహరించుకొన్నారు. 9వ తేదీన నేరుగా చిక్‌మగళూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశంతో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను విడిపించారు. జగదీశ గౌడ, తిలక్ గౌడ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళకు దిగటంతో అధికార బీజేపీ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. జగదీశ గౌడకు తమ పార్టీకి ఏ సంబంధం లేదని చిక్‌మగళూరు బీజేపీ అధ్యక్షుడు వరసిద్ధి వేణుగోపాల్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

