న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లతోపాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, నీట మునిగిన భజనపుర ప్రాంతం రోడ్డుపై బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శి తాజిందర్ బగ్గా రాఫ్ట్ నడిపారు. ఢిల్లీని జలమయం చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన మండిపడ్డారు. ‘ఈ సీజన్లో, నేను వాస్తవానికి రాఫ్టింగ్ కోసం రిషికేశ్కు వెళ్లాలనుకున్నాను. అయితే కరోనా కారణంగా, పదేపదే లాక్డౌన్ల వల్ల వెళ్లలేకపోయాను. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రతి మూల రాఫ్టింగ్ కోసం ఏర్పాట్లు చేసినందుకు నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని విమర్శించారు. ఎప్పటిలాగే ఈ ఘనతపైనా ఢిల్లీలో బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరుతున్నాను అని ఎద్దేవా చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021