గువాహటి: త్రిపురలో బీజేపీ నాయకుడు ఒకరు ఎన్నికల అధికారిపై దాడికి తెగబడ్డారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా శుక్రవారం త్రిపుర ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ నేత కాజల్ దాస్ ప్రిసైడింగ్ అధికారిపై చేయిచేసుకున్నా రు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పలువురు ఇతర వ్యక్తులు కూడా అధికారిపై దాడి చేస్తున్నట్టు అందులో ఉన్నది. వారెవన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉన్న ది. ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు.. దాడికి పాల్పడిన బీజేపీ నేతను సోమవారం అరెస్ట్ చేశారు.