KS Eshwarappa | కర్నాటకలో ఆపరేషన్ లోటస్ : కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు
పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగళూర్ : ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కుప్పకూల్చే కుయుక్తులకు కాషాయ పార్టీ మళ్లీ పదునుపెడుతోంది. కర్నాటకలో ఆపరేషన్ లోటస్‌కు తెరలేపుతున్నట్టు స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే వెల్లడించారు. పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో సగం మంది హస్తం గూటికి చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నాని కానీ ఏ ఒక్క కాషాయ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరబోరని స్పష్టం చేశారు. దమ్ముంటే నెలరోజుల్లోగా కనీసం ఒక్క ఎమ్మెల్యేను ఆకర్షించాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
మీ సొంత ఎమ్మెల్యేలకే మీపై నమ్మకం లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఈశ్వరప్ప అన్నారు. కాగా ఆలయాలను నిర్మించేందుకు మసీదులను కూలగొట్టాలని ఇటీవల ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Read More :
Go to Pak | పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం.. ముస్లిం విద్యార్థులపై టీచర్ ఆగ్రహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

