కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం రేసులో సువేందు అధికారితో పాటు దిలీప్ జోషి ఉన్నారు. అయితే మహిళలకు పెద్దపీట వేయాలనుకుంటున్న బీజేపీ.. బెంగాల్లో సీఎం పోస్టును మహిళకు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో మహిళను సీఎంగా ప్రకటించాలని ప్రయత్నిస్తే, ఆ పోస్టు రేసులో అగ్నిమిత్ర పౌల్(Agnimitra Paul) ముందు వరుసలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మే 9వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బెంగాల్ బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. మరో వైపు సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సీఎం రేసులో అగ్నిమిత్ర పౌల్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ్ సీటు నుంచి పోటీ చేసి ఆమె 40 వేల మెజారిటీతో గెలిచారు. మమతా బెనర్జీకి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తే, అగ్నిమిత్ర పౌల్ ఆ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి.
అగ్నిమిత్ర ఓ ఫ్యాషన్ డిజైనర్. 2019 నుంచి 2024 వరకు ఎంపీగా చేశారామె. ఎన్నికల అఫిడవిట్లో ఆమెపై పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇక ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కూడా సీఎం రేసులో ఉన్నారు.