న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో డైమండ్ హార్బర్ సిట్టింగ్ ఎంపీ, టీఎంసీ ముఖ్య నేత అభిషేక్ బెనర్జీపై వెటరన్ లీడర్ అభిజిత్ దాస్‌ను బీజేపీ పోటీకి దింపింది.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్‌కు బదులుగా ఆయన భార్య అనితా సోమ్ ప్రకాశ్‌ను ఈసారి బీజేపీ ఎన్నికల బరిలో నిలుపుతున్నది. మహారాష్ట్రలో సతారా నుంచి ఛత్రపతి శివాజీ వారసుడు ఉదయాన్రాజే భోసలేను రంగంలోకి దించుతున్నది.