8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
ప్రియుడితో కలిసి ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని మండ్య నగర శివారులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రియుడితో కలిసి ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని మండ్య నగర శివారులో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సహనా (25) ఎనిమిదేళ్ల కిందట ఆటో డ్రైవర్ వీరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. వీరు బెంగళూరులోని మదనాయకనహళ్లిలో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో పొరుగున ఉండే రాహుల్‌తో సహనాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం వీరేశ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీనిపై కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇదే విషయంపై సోమవారం కూడా సహనా దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మండ్యా జిల్లాలోని గున్నాయకనహళ్లిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సహనా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకున్న రాహుల్ గురువారం అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి వీరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
మండ్య శివారులోని ఇందువాల ప్రాంతం వీసీ ఫామ్ రైల్వే గేట్ సమీపంలో కదులుతున్న రైలులో నుంచి కిందపడి సహనా, రాహుల్ మృతిచెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మండ్య రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయినప్పటికీ మరణాలకు దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

