RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మరో భారీ చిత్రంపై టాలీవుడ్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో తెరపైకి వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ17గా ప్రచారం జరుపుకుంటుంది.
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మరో భారీ చిత్రంపై టాలీవుడ్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో తెరపైకి వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ17గా ప్రచారం జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. సాధారణంగా సుకుమార్ తన సినిమాల్లో నటీనటుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కథకు తగిన హీరోయిన్ను ఎంపిక చేసేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీ17 కోసం పలువురు కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ఈ జాబితాలో సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి పేర్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే వీరిలో ఎవరినీ చిత్రబృందం అధికారికంగా ఖరారు చేయలేదు. హీరోయిన్ ఎంపికపై ఈ నెల చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను 2027 ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక వంటి అంశాలపై దర్శకుడు సుకుమార్ దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోయిన్ ఎంపిక పూర్తయిన తర్వాత మిగతా నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి నుంచి మరో సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీ17లో రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు? సుకుమార్ ఎలాంటి కథను సిద్ధం చేశారు? హీరోయిన్గా ఎవరికి అవకాశం దక్కుతుంది? అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actress
- ram charan
- RC 17
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

