Priyanka Gandhi : పార్లమెంట్లో అసలైన అంశాలు లేవనెత్తడం ఎన్డీఏ సర్కారు ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) విమర్శించారు. శుక్రవారం లోక్‌సభ (Lok Sabha) లో చేసిన తొలి ప్రసంగంలోనే ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆమె.. శనివారం మరోసారి కేంద్ర సర్కారు వైఖరిని తప్పుపట్టారు. నిజాలు మాట్లాడితే కేంద్రానికి నచ్చడం లేదని అన్నారు.
శుక్రవారం లోక్‌సభలో తాను చేసిన ప్రసంగం నుంచి అదానీ అనే పదాన్ని తొలగించారని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఆ పదాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. అదానీ అనే పదం ఏమైనా అన్‌పార్లమెంటరీ పదమా..? అని ప్రియాంకా ఫైర్ అయ్యారు. వాళ్లు పార్లమెంటులో ఎవరి పేరైనా ఎత్తువచ్చు, కానీ తాము మాత్రం అదానీ పేరు ఎత్తకూడదా..? అని మండిపడ్డారు. బీజేపీ నేతలు తరచూ నెహ్రూ, ఇందిర, రాజీవ్ పేర్లు ప్రస్తావించడంపై ఆమె ఈ విధంగా స్పందించారు.
#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, “… BJP does not want to talk about the real issues. The word ‘Adani’ has been expunged from my speech. Why so? Is it an unparliamentary word? They can name anyone but we cannot name Adani?” pic.twitter.com/WskLl0bFwl
— ANI (@ANI) December 14, 2024