ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Polls) నేపథ్యంలో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన బహుజన్ వికాశ్ అగాధీ పార్టీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తవడే.. పాల్గర్ జిల్లాలోని విరార్ హోటల్లో డబ్బులు పంచినట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నలసోపర రాజన్ నాయక్ డబ్బులు పంచినట్లు బహుజన్ వికాశ్ అగాధీ పార్టీ ఆరోపించింది. ఓటర్లను ఆకర్షించేందుకు .. మాజీ మంత్రి సమక్షంలో డబ్బులు పంచినట్లు ఆ పార్టీ పేర్కొన్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే షిటిజి థాకూర్‌తో పాటు బీవీఏ పార్టీ కార్యకర్తలు హోటల్‌కు చేరుకుని హంగామా చేశారు.
మాజీ మంత్రి తవడేను .. బహుజన్ వికాశ్ పార్టీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. నగదు కలిగిన ఎన్విలాప్లతో పాటు మీటింగ్ వేదిక వద్ద డైరీలు ఉన్నట్లు గుర్తించారు. బహుజన్ వికాశ్ అగాధీ కార్యకర్తలు తమ చేతుల్లో కరెన్సీ నోట్లను పట్టుకుని మాజీ మంత్రి ముందు ప్రదర్శించారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ హోటల్లో జరిగిన ఘటన గురించి కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోలను షేర్ చేసింది. ఓటర్లను వశపరుచుకునేందుకు బీజేపీ డబ్బును పంచిపెడుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. టాప్ నేతలు దీంట్లో జోక్యం చేసుకున్నారని, ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
బహుజన్ వికాశ్ అగాధీ పార్టీ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. అవి నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నది. ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించేందుకు మీటింగ్ పెట్టికున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
BJP के राष्ट्रीय महासचिव विनोद तावड़े महाराष्ट्र के एक होटल में पैसे बांटते हुए पकड़े गए हैं।
विनोद तावड़े बैग में भरकर पैसे लेकर गए थे और वहां पर लोगों को बुला-बुलाकर पैसे बांट रहे थे।
ये खबर जब जनता को पता चली तो भारी हंगामा हो गया। पैसों के साथ विनोद तावड़े के कई वीडियो… pic.twitter.com/iqbMcGJtyQ
— Congress (@INCIndia) November 19, 2024