బెంగళూరు: పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచారం ప్రారంభించేశాను. ఎన్నికలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.