పనాజీ: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ మొదలు యూపీలో ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే దశలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. అందుకే ఉత్తరాఖండ్‌తోపాటు గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలు బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లతో జాబితాలను ప్రకటించాయి. తాజాగా అధికార బీజేపీ కూడా 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జాబితా వెల్లడించింది.
గోవా ఉపముఖ్యమంత్రి మనోహర్ అజ్గాంకర్ మార్గావ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని బీజేపీ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఎక్కడి నుంచి చేస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మరోహర్ పారికర్ స్వస్థలమైన పంజిమ్ నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించామని చెప్పారు.
అందుకు ప్రతిగా ఉత్పల్ పారికర్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు ఫడ్నవీస్ తెలిపారు. తాము ఇచ్చిన తొలి ఆప్షన్‌ను ఉత్పల్ తిరస్కరించారని, రెండు ఆప్షన్‌పై చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తాము సూచించిన ఆ రెండో స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉత్పల్ ఒప్పుకుంటారని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తంచేశారు.
BJP announces 34 candidates for the upcoming #GoaElections
— ANI (@ANI) January 20, 2022
CM Pramod Sawant to contest from Sanquelim and Deputy CM Manohar Ajgaonkar from Margao pic.twitter.com/ErC2GM6va4