Birthday Boy: డీజీ బిల్లు ఇవ్వలేదని.. బర్త్‌డే బాయ్‌ను చంపేసిన ఫ్రెండ్స్
Birthday boy: పుట్టిన రోజే ఆ కుర్రాడి ప్రాణాలకు చివరి రోజు అయ్యింది. ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చిన అతను .. డీజే బిల్లు కట్టేందుకు నిరాకరించాడు. దీంతో స్నేహితుల మధ్య గొడవైంది. ఆ ఘర్షణలో బర్త్‌డే బాయ్‌ని హతమార్చారు.
ముంబై: ముంబైలో దారుణం జరిగింది. బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఓ 20 ఏళ్ల కుర్రాడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. బర్త్‌డే కోసం ఫ్రెండ్స్ డీజే ఏర్పాటు చేశారు. అయితే ఆ డీజే బిల్లును చెల్లించేందుకు బర్త్‌డే బాయ్(birthday boy) నిరాకరించాడు. దీంతో వాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆ కుర్రాడిని ఫ్రెండ్సే చంపేశారు. కత్తితో అతని ఛాతిలో పొడిచారు. వివరాల్లోకి వెళ్తే..
సాబిర్ అన్సారీ అనే 20 ఏళ్ల కుర్రాడు తన బర్త్‌డే సందర్భంగా దాబాలో దావత్ ఇచ్చాడు. పది వేలు ఖర్చు పెట్టి ఫుడ్ ఎంజాయ్ చేశారు. అయితే సాబిర్ స్నేహితుడు ఒకరు పార్టీ కోసం డీజీ కిరాయి తీసుకున్నాడని, కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో డీజీ కోసం సాబిర్ డబ్బులు ఇవ్వలేదని, దీంతో సాబిర్ను తన స్నేహితులు చంపేసినట్లు బాధితుడి తండ్రి పోలీసులకు తెలిపాడు.
ఈ ఘటన ముంబైలోని గోవండిలో ఉన్న బైగన్‌వాడి ఏరియాలో గత వారం జరిగింది. ఈ కేసులో షారూక్, నిషార్‌లను అహ్మాదాబాద్‌లో అరెస్టు చేశారు. మరో ఇద్దరు మైనర్లను జువెనైల్ హోమ్‌కు పంపారు. శివాజీనగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

