న్యూఢిల్లీ : రెస్టారెంట్లో ఓ మహిళ ప్లేట్ నుంచి పాస్తాను దొంగిలించి ఆరగించిన బర్డ్ వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పక్షి తీరుతో మహిళ సైతం విస్తుపోవడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్లో ల్యాన్స్ అనే అకౌంట్ షేర్ చేసింది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 4.1 కోట్ల మంది వీక్షించారు.
Damn if this wasn’t recorded no one would believe it pic.twitter.com/ZgDbItaR8w
— Lance🇱🇨 (@Bornakang) July 24, 2023
ఈ వైరల్ క్లిప్‌లో రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురుగా పాస్తా ప్లేట్‌తో కనిపిస్తుంది. ఆపై అక్కడికి దూసుకొచ్చిన పక్షి ప్లేట్‌పై కూర్చుని పాస్తాను తింటుండటంతో మహిళ షాక్‌కు గురై చూస్తుండి పోవడం కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటికి పక్షి సురక్షిత ప్రాంతానికి ఎగిరివెళుతుంది.
పక్షిని తానేమీ అనబోనని, ఇది ఆకలితో ఉందేమో ఓ మైగాడ్ అంటూ మహిళ తిరిగి పాస్తా తినడంలో మునిగిపోతుంది, ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేయగా ఆపై ఎక్స్‌లో దూసుకుపోయింది. జులై 24న మెక్రోబ్లాగింగ్ సైట్లో ఈ క్లిప్‌ను అప్లోడ్ చేశారు.
Read More :
Hyderabad | హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టే డెవలప్మెంట్.. బుద్వేల్‌లో 180 ఎకరాల్లో లేఅవుట్