న్యూఢిల్లీ, మే 24: అదేంటి టామాటాల్లో విటమిన్-సి కదా ఉండేది.. కొత్తగా విటమిన్-డి ఉందంటున్నారేంటి అనే కదా మీ డౌటు. అవును సాధారణంగా ఎండలో కాసేపు ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్-డి ఉత్పత్తి అవుతుంటుంది. పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఈ విటమిన్ ఉంటుంది. అయితే ప్రస్తుత జీవన శైలి కారణంగా చాలామందిలో విటమిన్-డి లోపం ఉంటున్నది. ఈ లోపంతో క్యాన్సర్, డిమెన్షియా తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు బ్రిటన్లోని జాన్ ఇన్స్ సెంటర్ పరిశోధకులు కొత్త రకం టమాటాలను అభివృద్ధిపరిచారు. సహజసిద్ధంగానే టమాటాల ఆకుల్లో ప్రో విటమిన్-డి ఉంటుంది. అయితే అది విటమిన్-డిగా మారదు. జీన్ ఎడిటింగ్ క్రిస్పర్ కాస్ 9 సాంకేతికత సాయంతో టమాటాల్లో విటమిన్-డి ఉత్పత్తి అయ్యేలా పరిశోధకులు చేశారు.