న్యూఢిల్లీ: ఇక నుంచి జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)ను బహుళ ప్రయోజనాలకు ఏక పత్రంగా వినియోగించనున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, ఓటరు లిస్టుల తయారీ, ఆధార్, పెండ్లి రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం తదితర అవసరాలకు దీనినే ప్రమాణ పత్రంగా గుర్తిస్తూ చట్ట సవరణ చేస్తూ లోక్‌సభలో బుధవారం బిల్లును ప్రవేశపెట్టారు. కాగా, ఈ బిల్లు కారణంగా దత్తత, అనాథ, విడిచిపెట్టిన, సరోగసి, అవివాహిత తల్లులు కూడా సులభంగా పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందుతారు. దవాఖానలో మరణాలు సంభవిస్తే మరణానికి గల కారణాన్ని తెలియజేస్తూ డాక్టర్లు తప్పనిసరిగా సర్టిఫికెట్‌ను అందజేయాలి. దాని ఓ కాపీని రిజిస్ట్రార్‌కు, మరొకటి రోగి బంధువుకు ఇవ్వాలి.