తుమకూరు: భారీ వర్షాల కారణంగా ఆ రోడ్డు ఒక నదిలా తయారైంది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొందరు ఆ రోడ్డు దాటుతున్నారు. మరికొందరు తమ బైకులపై రోడ్డు దాటాలని ప్రయత్నించారు. అలా చేస్తుండగా ఒక వ్యక్తి తన బండితో సహా కింద పడిపోయాడు.
నీటి ప్రవాహ వేగాన్ని అడ్డుకోలేక బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ కాసేపటికే రోడ్డుకు ఆవలివైపుకు చేరుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు రోడ్డుపై జరిగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అతనే కాకుండా మరో బైకర్ కూడా ఇలాగే కింద పడిపోగా.. చుట్టుపక్కల వారు అతన్ని కాపాడారు. కాగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.