బీఎస్ఎఫ్ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్టే చలిలో వణుకుతూ.. మోకాళ్ల లోతు చలిలో నిలబడి బార్డర్లో దేశానికి కాపలా కాస్తుంటారు. వానకు తడుస్తారు. ఎండకు ఎండుతాడు. చలికి వణుకుతారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం సేవ చేస్తారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే మనం జవాన్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాం. తాజాగా బీఎస్ఎఫ్ జవాన్లు.. బీహు ఫెస్టివల్‌ను గడ్డ కట్టే చలిలో సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహు అనే పండుగను అస్సాంలో ఘనంగా జరుపుకుంటారు. మనకు సంక్రాంతి ఎలాగో.. వాళ్లకు బీహు పండుగ అలా అన్నమాట. ఆ పండుగను కశ్మీర్లో బార్డర్ వద్ద జవాన్లు ఘనంగా జరుపుకున్నారు. తమ రాష్ట్ర పండుగ సంప్రదాయ డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ఆ వీడియోను కశ్మీర్ డివిజన్‌కు చెందిన బీఎస్ఎప్ యూనిట్ ట్విట్టర్లో వీడియోను షేర్ చేసింది. ఆ ప్రాంతంలో చలి ఎప్పుడూ మైనస్ డిగ్రీలలో ఉంటుంది. మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఆర్మీ జవాన్లు డ్యాన్స్ చేస్తూ అక్కడే పండుగను జరుపుకున్నారు.
ఆ వీడియోను చూసి నెటిజన్లు వాళ్లందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా మన కుటుంబంతో పండుగ జరుపుకుంటున్నాం. కానీ.. వాళ్లు మాత్రం దేశం కోసం.. దేశ రక్షణ కోసం కుటుంబాన్ని వదిలేసి బార్డర్ వద్ద కాపలా కాస్తున్నారు. పండుగ సమయంలో కూడా కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించి సేవ చేస్తున్న మీకు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.