ఉస్మా: పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో ఓ విద్యార్థి తరగతి గదిలో సహ విద్యార్థినిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
సోమవారం ఉస్మాలోని మాయి భాగో న్యాయ కళాశాలలో జరిగిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మృతురాలిని సందీప్ కౌర్‌గా, నిందితుడిని ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపింది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.