పాట్నా: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఆదేశంతో హోలీ రోజున డ్యాన్స్ చేసిన పోలీస్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్యాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతావన్న తేజ్ ప్రతాప్ బెదిరింపుతో ఆ పోలీస్ డ్యాన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ కానిస్టేబుల్‌ను సెక్యూరిటీ గార్డు బాధ్యతల నుంచి తప్పించారు. పోలీస్ లైన్‌కు ఆయనను అటాచ్ చేశారు.
కాగా, తేజ్ ప్రతాప్ భద్రత కోసం ఆయన స్థానంలో మరో పోలీస్ కానిస్టేబుల్‌ను నియమిస్తామని ఎస్పీ కార్యాలయం తెలిపింది. ‘ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ సెక్యూరిటీ గార్డుగా నియమించిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ యూనిఫాంలో డ్యాన్స్ చేసినందుకు తక్షణమే పోలీసు లైన్లకు పంపడం జరిగింది. కుమార్ స్థానంలో ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం మరో కానిస్టేబుల్‌ను నియమిస్తారు’ అని ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు హోలీ నాడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన నివాసం సమీపంలోని ప్రాంతాల్లో స్కూటర్‌పై తిరిగారు. ఈ నేపథ్యంలో ఆ స్కూటర్ యజమానిపై పాట్నా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా స్కూటర్ డ్రైవ్ చేయడం, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా లేకపోవడంపై భారీగా జరిమానా విధించారు. స్కూటర్ యజమానికి రూ. 4,000 మేర చలాన్లు జారీ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు.
VIDEO | A policeman was seen dancing on the instruction of RJD leader Tej Pratap Yadav during Holi celebration at his residence in Patna. #tejpratapyadav #Holi #Patna pic.twitter.com/oCIP0kL03r
— Press Trust of India (@PTI_News) March 15, 2025