పాట్నా: ఆలయాలు, మఠాలు, ట్రస్టుల రిజిస్ట్రేషన్‌ను బీహార్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో నమోదు కాని ఆలయాలను నమోదయ్యేలా చూడాలని ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వాటి స్థిరాస్తుల వివరాలను బీహార్ రాష్ట్ర మత పరమైన ట్రస్టుల బోర్డు(బీఎస్బీఆర్టీ) వెబ్సైట్లో ఉంచాలని తెలిపింది. బీహార్ హిందూ మత ట్రస్ట్‌ల చట్టం-1950 ప్రకారం అన్ని దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, ధర్మశాలలు బీఎస్బీఆర్టీలో వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి నితిన్ నబిన్ గురువారం తెలిపారు. రిజిస్టర్ అయిన దేవాలయాలు, మఠాలు, ట్రస్ట్‌లకు సంబంధించిన చట్ట విరుద్ధ ఆస్తుల లావాదేవీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కటిహార్, ఆగస్టు 8: బీహార్‌లో మరో బ్రిడ్జి కూలింది. కటిహార్ జిల్లాలోని గంగానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిలో కొంత భాగం గురువారం కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. బకియా సుఖాయె పంచాయతీని జిల్లా కేంద్రానికి కలుపుతూ నిర్మిస్తున్న ఈ చిన్న బ్రిడ్జిని రూరల్ వర్క్స్ శాఖ నిర్మిస్తున్నది. నదీ ప్రవాహ ఒత్తడి వల్లే నిర్మాణంలో ఉన్న పిల్లర్లు కూలాయని అధికారులు తెలిపారు.