బీఆర్ఎస్ సభకు తేజస్వి.. బీహార్ సీఎం నితీశ్ వెల్లడి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించబోయే బీఆర్ఎస్ మలికేక సభకు తమ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జనతాదళ్ (యూ) ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్‌సింగ్ అలియాస్ లలన్ను వెళ్లాలని తాను కోరినట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వెల్లడించారు
- లలన్తో కలిసి హైదరాబాద్‌కు
పాట్నా, జనవరి 29: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించబోయే బీఆర్ఎస్ మలికేక సభకు తమ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జనతాదళ్ (యూ) ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్‌సింగ్ అలియాస్ లలన్ను వెళ్లాలని తాను కోరినట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వెల్లడించారు. కైమూర్ జిల్లా పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సభకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నన్ను కోరారు. కానీ, ముందస్తు షెడ్యూల్ వలన తీరిక లేకుండా ఉన్నానని చెప్పా. పార్టీ తరపు నుంచి ఎవరినైనా పంపించాలని కేసీఆర్ కోరారు. దీంతో సభకు వెళ్లాలని నేను లలన్ను కోరాను.’ అని తెలిపారు.
తేజస్వీయాదవ్‌కు కూడా చెప్పాలని కేసీఆర్ ఈ సందర్భంగా తనను కోరారని చెప్పారు. తాను ఇద్దరితోనూ మాట్లాడానని, తేజస్వీయాదవ్, లలన్ ఇద్దరూ హైదరాబాద్ వెళ్తారని నితీశ్‌కుమార్ స్పష్టంచేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత చాటేందుకు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, విజయన్‌తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, జాతీయ నేతలు హాజరయ్యారు. తాను వివిధ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు వెళ్లలేకపోయానని నితీశ్‌కుమార్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Attend
- Bihar
- BRS meeting
- deputy cm
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

