Nitish Kumar : బీహార్ (Bihar) లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖలు కూడా తమతమ పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.
తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బక్తియార్పూర్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ 121 స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.
#WATCH | Bakhtiyarpur, Patna: Bihar CM Nitish Kumar shows his inked finger after casting his vote in the first phase of #BiharElections2025. pic.twitter.com/QeXWHKsUhx
— ANI (@ANI) November 6, 2025