Nitish Kumar: అతడు కావాలనుకుంటే నన్ను కాల్చేయవచ్చు: బీహార్ సీఎం చమత్కారం
Nitish Kumar: బీహార్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, నితీశ్ తొలగిపోవడం ఖాయమని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనదైన రీతిలో స్పందించారు. లాలూ ప్రసాద్ ప్రకటనపై

పట్నా: బీహార్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, నితీశ్ తొలగిపోవడం ఖాయమని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ( Nitish Kumar ) తనదైన రీతిలో స్పందించారు. లాలూ ప్రసాద్ ప్రకటనపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘అతను నన్ను కాల్చేయవచ్చు. అంతకుమించి అతను ఇంకేమీ చేయలేడు. అతను నన్ను కాల్చాలనుకుంటే కాల్చేయవచ్చు’ అని నవ్వుతూ నితీశ్ కుమార్ చమత్కరించారు.
బీహార్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అభ్యర్థుల తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, నితీశ్ కుమార్ తొలగింపు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మీడియా నితీశ్కుమార్ ముందు ప్రస్తావించడంతో ఆయన పైవిధంగా స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

