Nitish assets | ఆవులు, దూడలు, ఉంగరాలు సహా బీహార్ సీఎం ఆస్తుల విలువ ఎంతంటే..!
Nitish assets | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సెక్రెటేరియట్ డిపార్టుమెంట్‌కు చెందిన వెబ్సైట్లో ఆస్తుల వివరాలను పొందుపర్చారు. నితీశ్ ఆస్తుల జాబితాలో ఆవులు, దూడలు, బంగారు, వెండి ఉంగరాలు, బ్యాంకు డిపాజిట్స్ మొదలైనవి ఉన్నాయి.
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సెక్రెటేరియట్ డిపార్టుమెంట్‌కు చెందిన వెబ్సైట్లో ఆస్తుల వివరాలను పొందుపర్చారు. నితీశ్ ఆస్తుల జాబితాలో ఆవులు, దూడలు, బంగారు, వెండి ఉంగరాలు, బ్యాంకు డిపాజిట్స్ మొదలైనవి ఉన్నాయి.
తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.64 కోట్లుగా నితీశ్ కుమార్ పేర్కొన్నారు. అందులో రూ.22,252 నగదు రూపంలో, రూ.49,202 వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా తనకు రూ.11.32 లక్షల విలువచేసే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఉన్నదని వెల్లడించారు. రూ.1.28 లక్షల విలువైన బంగారు, వెండి ఉంగరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా తన ఇతర చరాస్తుల్లో 13 ఆవులు, 10 దూడలు ఉన్నాయని తెలిపారు. వాటి విలువ రూ.1.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. వాటితోపాటు ఒక ట్రెడ్మిల్, ఎక్సైజ్ సైకిల్, మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నాయని వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే తన దగ్గర ఉన్న ఏకైక స్థిరాస్తి 20 ఏండ్ల క్రితం కొన్న ఒక అపార్టుమెంట్ అని చెప్పారు. ఆ అపార్టుమెంట్ విలువ 2004లో రూ.13.78 లక్షలని, ఇప్పుడు దాని విలువ రూ.1.48 కోట్లకు చేరిందని తెలిపారు.
ఈ విధంగా అన్ని ఆస్తులు కలిపితే వాటి విలువ రూ.1.64 కోట్లు ఉంటదని నితీశ్‌కుమార్ తన ఆస్తుల జాబితాలో వెల్లడించారు. కాగా, గత ఏడాది నితీశ్ తన ఆస్తుల విలును రూ.75.53 లక్షలుగా చూపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

