Bihar Cabinet | బీహార్ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం నితీశ్ దగ్గరే హోంశాఖ
Bihar Cabinet | బీహార్‌లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన నూతన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ, రోడ్లు భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలను అప్పగించారు.
Bihar Cabinet: బీహార్‌లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన నూతన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ, రోడ్లు భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలను అప్పగించారు.
అత్యంత కీలకమైన హోంశాఖను మాత్రం నితీశ్‌కుమార్ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. వీరితోపాటు మరో ఆరుగురు మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, డాక్టర్ ప్రేమ్ కుమార్, శ్రవణ్ కుమార్, సంతోష్ కుమార్ సుమన్, సుమిత్ కుమార్ సింహాలకు కూడా సీఎం నితీశ్ వివిధ శాఖలను కేటాయించారు.
కాగా, నితీశ్‌కుమార్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశారు. అనంతరం జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. తర్వాత ఏడాదికే బీజేపీతో విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వాన్ని కూల్చి, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, నితీశ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇటీవల ఆర్జేడీతో కూడా విభేదాలు తలెత్తడంతో ఇప్పుడు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చేశారు. మళ్లీ బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ బీజేపీ ముఖ్య నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. తాజాగా కొత్త క్యాబినెట్‌లోని మంత్రులందరికీ శాఖలు కేటాయించారు.
Bihar cabinet portfolio allocation | CM Nitish Kumar keeps Home Department; Deputy CM Samrat Chaudhary gets Finance, Health, Sports Departments; Deputy CM Vijay Sinha gets Agriculture. pic.twitter.com/beT2L3Ptkt
— ANI (@ANI) February 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

