న్యూఢిల్లీ: బీహార్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే రేష్మీ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తనను రాజీనామా చేయమని ఎవరూ బలవంతపెట్టలేదని, వ్యక్తిగత కారణాలవల్ల తానే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రేష్మీ వర్మ గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్కాటియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు.
కాగా, ఏడాది క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ, కూటిమిగా బరిలో దిగిన జేడీయూ, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించాయి. కూటమిలోనూ అధికార జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్నే బీజేపీ సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.
Bihar: BJP MLA from Narkatiya, Rashmi Verma announces resignation citing "personal reasons" pic.twitter.com/ltbw1f018U
— ANI (@ANI) January 9, 2022