న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖతాదారులకు.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. ఈ-నామినేషన్ గడువును పొడిగించింది. ఇంతకు ముందు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్సైట్ను ఓపెన్ చేస్తుండడంతో సర్వర్ మొరాయిస్తున్నది.
దీంతో ఖాతాదారులకు ఈ-నామినేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈ-నామినేషన్ తేదీని పొడిగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి డెడ్లైన్ మాత్రం విధించలేదు. అయితే, తప్పనిసరిగా వీలైనంత తర్వగా ఖాతాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేయాలని సూచించింది.
Empower your family, file enomination. #EPFO pic.twitter.com/sY8EjuDjSs
— EPFO (@socialepfo) December 29, 2021