Maharashtra Results | ముంబై : ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీ – మహా వికాస్ అఘాడీ మధ్య పోటాపోటీ ఉంది. మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో బీజేపీ 10, ఉద్ధవ్ థాకరే(ఎంవీఏ) 11, ఏక్నాథ్ షిండే సేన గ్రూప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏక్నాథ్ షిండే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి.
ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ లీడ్లో ఉన్నారు. ఇక ముంబై నార్త్ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్, బీద్ నుంచి బీజేపీ అభ్యర్థి పంకజ్ ముండే, బారామతి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ వెనుకంజలో ఉన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ నాలుగు, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కొక్క స్థానంలో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు.