ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. సీఎం పుష్కర్ సింగ్ ఓటమి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్నా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. భువన్ చంద్ కప్రీ.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీపై 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖతిమా నియోజకవర్గంలో 91,325 ఓట్లు పోలవగా.. పుష్కర్ సింగ్ ధామికి 40,675, కాంగ్రెస్ అభ్యర్థి భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో.. బీజేపీ పార్టీ 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు అవసరం కాగా.. 48 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇతర పార్టీలకు చెందిన నలుగురు లీడ్‌లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

