న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్(Bibhav Kumar)కు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై బిభవ్ అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంవో కార్యాలయంలో.. బిభవ్‌కు ఎటువంటి పోస్టు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది. పర్సనల్ అసిస్టెంట్‌గా లేదా ఇతర హోదాను బిభవ్‌కు ఇవ్వరాదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. అతని కేసులో అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించేంత వరకు సీఎం కార్యాలయంలోకి బిభవ్ ప్రవేశించరాదు అని కోర్టు ఆదేశించింది. మే 18వ తేదీన బిభవ్‌ను అరెస్టు చేశారు. వంద రోజుల తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు.