న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భువనేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదనపు కార్యదర్శిగా కొనసాగుతారు.
ప్రస్తుత యూఐడీఏఐ సీఈఓ అమిత్ అగర్వాల్ ఫార్మా కార్యదర్శిగా నియమితులయ్యారు. భువనేశ్ 1995 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్, బంగారు పతక విజేత కూడా. ఆయన కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక పదవులను నిర్వహించారు.