Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆపై ఏటా 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తామని హరియాణ మాజీ సీఎం, అసెంబ్లీలో విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం హరియాణాలో రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
2014లో కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోయే ముందు తలసరి ఆదాయంలో, తలసరి పెట్టుబడులు, క్రీడలు, శాంతిభద్రతల పరిస్ధితిలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని, ఇవాళ అన్ని రంగాల్లో హరియాణ వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయని అన్నారు. శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేయాల్సిన పరిస్ధితి నెలకొందని, అయినా వారికి న్యాయం దక్కలేదని అన్నారు. హరియాణలో బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని అత్యధిక స్ధానాలు సాధించి హరియాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ