Bhupesh Baghel | అవినీతి నేతలందరినీ బీజేపీలో చేర్చుకోవడమే మోదీ గ్యారంటీ : భూపేష్ బఘేల్
Bhupesh Baghel : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అసత్యాల పత్రమని విపక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎన్నికల ప్రణాళిక తప్పుల తడకని దుయ్యబట్టింది.
Bhupesh Baghel : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అసత్యాల పత్రమని విపక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎన్నికల ప్రణాళిక తప్పుల తడకని దుయ్యబట్టింది. చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ బీజేపీ మేనిఫెస్టోపై విరుచుకుపడ్డారు. అవినీతి నేతలందరినీ బీజేపీలో చేర్చుకోవడమే మోదీ గ్యారంటీయా అని కాషాయ నేతలను ఆయన నిలదీశారు. ఇక అంతకుముందు బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు బూటకమని కాంగ్రెస్, ఆప్ నేతలు విమర్శించారు.
సమాజంలో ఏ వర్గానికీ ప్రధాని నరేంద్ర మోదీ మేలు చేయలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోను ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ రైతులకు కనీస మద్దతు ధరను కల్పిస్తామని మాట తప్పారని ఖర్గే ఆరోపించారు. మోదీ తన హయాంలో ఏ వర్గానికీ మేలు చేయలేదన్నారు. బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రం కాదని, క్షమాపణ పత్రంలా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ దేశ దళితులు, రైతులు, యువత, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టో అసత్యాల పత్రమని దీన్ని ఎవరూ నమ్మరని ఖేరా పేర్కొన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు కనీస మద్ధతు ధర ఊసే లేదని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మేనిఫెస్టో బూటకపు హామీలు గుప్పించిందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ధరల మంట, నిరుద్యోగంపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని ఆమె పేర్కొన్నారు.
Read More :
IIT | వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటీల్లో కొత్త కోర్సులు.. పెరగనున్న సీట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

