సిటీలో తగ్గిన బస్సుల రాకపోకలు
దీపావళి సందర్భంగా నగర బస్సుల్లో చాలా వరకు జిల్లాలకు కేటాయిస్తున్నారు. దీంతో నగరంలో బస్సుల రాకపోకలు శుక్రవారం తగ్గాయి. మరోవైపు సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు.
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : దీపావళి సందర్భంగా నగర బస్సుల్లో చాలా వరకు జిల్లాలకు కేటాయిస్తున్నారు. దీంతో నగరంలో బస్సుల రాకపోకలు శుక్రవారం తగ్గాయి. మరోవైపు సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. సాంకేతిక యాప్ గమ్యంలోనూ బస్సుల సమాచారం అప్డేట్ కావడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సుల రాకపోకల సమాచారం తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు షెల్టర్లలో ఏ బస్సు ఎప్పుడొస్తుందో కూడా చెప్పేవారు ఉండటం లేదు. ఫలితంగా అరగంట వరకు ఎదురుచూసి చాలా మంది ప్రయాణికులు ఆన్లైన్ ఆధారిత వాహన సేవలను వినియోగించుకుంటున్నారు. బస్సు పాస్లున్నా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. రాత్రి సమయాల్లో కొన్ని సర్వీస్లు రద్దు అవుతున్నాయి. దీంతో రద్దయిన విషయం కూడా ప్రయాణికులకు తెలియడం లేదు. బస్సుల సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

