మెట్రో -ఆర్టీసీ కామన్ పాస్ రూ.4 వేలకే!
ఆర్టీసీ-మెట్రో కామన్పాస్ ధరపై ప్రయాణికుల ఆగ్రహంతో రవాణాశాఖ దిగొచ్చింది. రూ.8,500 ఉన్న నెలవారీ కామన్పాస్ ధరను రూ.4 వేలకు తగ్గించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ-మెట్రో కామన్పాస్ ధరపై ప్రయాణికుల ఆగ్రహంతో రవాణాశాఖ దిగొచ్చింది. రూ.8,500 ఉన్న నెలవారీ కామన్పాస్ ధరను రూ.4 వేలకు తగ్గించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన వీడియో ద్వారా తన సందేశాన్ని పంపారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశాలతో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలు భారీగా తగ్గించామని చెప్పారు. ప్రస్తుతం రూ.400 ఉన్న రోజువారి ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించామని, ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీకి కేటాయించినట్టు వివరించారు.
ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రూ.8,500 ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు తగ్గించినట్టు చెప్పారు. రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించినట్టు పేరొన్నారు. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్ఠంగా 50 సింగిల్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి పరిమితులు లేవని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

