గాంధీనగర్, డిసెంబర్ 12: గుజరాత్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర సీఎంగా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 16 మంది చేత మంత్రులుగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఈ 16 మందిలో 11 మంది మాజీ మంత్రులే ఉన్నారు. గత ప్రభుత్వంలోని ఏడుగురు తిరిగి మంత్రి పదవులు దక్కించుకొన్నారు.