బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇఫ్తార్ విందు… వీసీ తీరుపై విద్యార్థుల నిరసన
లక్నో: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో ఇఫార్ విందు ఏర్పాటు చేయడంపై కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. మహిళా మహావిద్యాలయంలో బుధవారం జరిగిన ఇఫ్తార్ విందులో వైస్ ఛాన్సలర్ సుధీర్ కె జైన్ పాల్గొనడంపై వారు మండిపడ్డారు. బుధవారం రాత్రి వీసీ నివాసం ఎదుట నిరసన తెలిపి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. క్యాంపస్‌లో కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టి రాజకీయాలను వీసీ ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.
బీహెచ్‌యూలో ఇఫ్తార్ విందు అధికారికంగా జరగడం ఇదే తొలిసారిని, ఖర్చులు కూడా యూనివర్సిటీనే భరించిందని విద్యార్థులు విమర్శించారు. ఇలాంటి వాటిని తాము అనుమతించబోమన్నారు. హిందూ వ్యతిరేకతపై మహిళా విద్యార్థుల్లో విభజనను సృష్టించేందుకు మహిళా మహావిద్యాలయాన్ని వీసీ ఎంచుకున్నారని ఆరోపించారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని, దీనిని తాము ఖండిస్తున్నామని అన్నారు. వీసీకి ఇఫ్తార్ కావాలంటే ఏఎంయూ లేదా జామియాకు ఆయన వెళ్లవచ్చని, ఇక్కడ కాదన్నారు.
మరోవైపు విద్యార్థుల ఆరోపణలను బీహెచ్‌యూ అధికారులు ఖండించారు. ఇఫ్తార్ విందులను పలు హాస్టల్లో ఏర్పాటు చేస్తుంటారని, అన్ని వర్గాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, ఇది సాధారణంగా జరిగేదే అని చీఫ్ ప్రొక్టర్ భువన్ చందా కప్రి తెలిపారు. ఇలాంటి ఇఫ్తార్ విందుల్లో కొన్ని సందర్భాల్లో ప్రధాని మంత్రి, సీఎంతోపాటు వర్సిటీ అధికారులు కూడా పాల్గొంటారని గుర్తు చేశారు. అయితే అధికారికంగా ఎప్పుడూ కూడా ఇఫ్తార్ విందులు జరుగలేదన్నారు.
Iftar parties are organised in different hostels, students from all communities take part. No official celebrations are done… This is not the first time any college official has joined the iftar party, PM & CM have also joined this before: Bhuvan Chanda Kapri, Chief Proctor BHU pic.twitter.com/VOsVnFOYTm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

