శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 11, 2020 , 11:48:17

12 మంది విదేశీయుల‌కు రూ. 6 వేల చొప్పున జ‌రిమానా

12 మంది విదేశీయుల‌కు రూ. 6 వేల చొప్పున జ‌రిమానా

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌త సంబంధ కార్యక్ర‌మంలో పాల్గొన్న 12 మంది విదేశీయుల‌కు న్యాయ‌స్థానం జ‌రిమానా విధించింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. మార్చిలో ఢిల్లీ, భోపాల్‌లో జ‌రిగిన మ‌త సంబంధం కార్య‌క్ర‌మానికి కిర్గిస్తాన్‌కు చెందిన‌ త‌బ్లిగీ జ‌మాత్ స‌భ్యులు 12 హాజ‌ర‌య్యారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకుగాను భోపాల్ కోర్టు నిన్న తీర్పును వెలువ‌రిస్తూ 12 మంది విదేశీయుల‌కు ఒక్కొక్క‌రికి రూ. 6 వేల చొప్పున జ‌రిమానా విధించింది. త‌బ్లిగీ జ‌మాత్ కేసులో మ‌రో న్యాయ‌స్థానం ఇండోనేషియాకు చెందిన 12 మందికి ఒక్కొక్క‌రికి రూ. 7 వేల చొప్పున జ‌రిమానా విధించిన‌ట్లు భోపాల్ జిల్లా ప్రాసిక్యూష‌న్ అధికారి తెలిపారు. 

మ‌ర్క‌జ్ త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశంపై ఆగ‌స్టు 6న సుప్రీం తీర్పును వెలువ‌రిస్తూ విదేశీయులు దేశం విడిచి వెళ్లేముందు త‌మ‌పై ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నాయో లేదో సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో సంప్ర‌దించి తెలుసుకోవాల్సిందిగా పేర్కొంది. త‌బ్లిగి జ‌మాత్ స‌మావేశంపై కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతూ విదేశీయుల పాస్‌పోర్టుల‌ను స్వాధీనం చేసుకుంది. వీసాల‌ను ర‌ద్దు చేసింది. ఈ అంశంపై విదేశీయులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను జస్టిస్ ఎ.ఎమ్. ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది.