బూస్టర్ డోస్‌గా అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్..ధర ఎంతంటే!
కొవిడ్-19 నియంత్రణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా అందించే నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత వారం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ : కొవిడ్-19 నియంత్రణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కుద్వారా అందించే నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత వారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 800కు విక్రయించనుండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ . 325 చెల్లించి ఇన్కోవాక్ను సేకరిస్తాయి.
ఇన్కోవాక్ నాసల్ వ్యాక్సిన్ కొవిన్ యాప్‌లో ఉండగా జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది. 18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఈ నాసల్ వ్యాక్సిన్‌ను ఇస్తారు. వ్యాక్సిన్ అభివృద్ధి రంగంలో భారత్ పరిశోధన, అభివృద్ధికి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఆవిష్కరణ మరో ఉదాహరణని ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా మండలి (ఎన్‌టాగి) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. దీన్ని సులభంగా వాడే వెసులుబాటుతో పాటు ఈ వ్యాక్సిన్ శ్వాస నాళాల నుంచి శ్వాసకోశ వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా రోగనిరోధక వ్యవస్ధను పెంచుతుందని వెల్లడించారు.
ఇక ఈ వ్యాక్సిన్‌పై మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా చేపట్టామని ఇన్కోవాక్ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది.మరోవైపు కొవిడ్-19 కేసులు చైనాలో అత్యంత వేగంగా ప్రబలడం, దారుణ పరిస్ధితులు నెలకొన్న నేపధ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా పలు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

