న్యూఢిల్లీ: జాతీయ భావాలు దెబ్బతినకుండా ఇకపై తమ కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉంటామని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. ఖాందహార్ విమాన హైజాక్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ‘ఐసీ-814: ద ఖాందహార్ హైజాక్’ సిరీస్లో ఇద్దరు హైజాకర్లు భోళా, శంకర్ల పేర్లపై వివాదం రావడంతో నెట్ఫ్లిక్స్ వివరణ ఇచ్చింది. ఇద్దరు ముస్లిం హైజాకర్ల పేర్ల స్థానంలో హిందువుల పేర్లు పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిరీస్లో హైజాకర్ల అసలు పేర్లను జోడించారు.
న్యూఢిల్లీ : సొడోమీ, లెస్బియనిజం అసహజ లైంగిక నేరమని చెప్తున్న పాఠ్యాంశాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పునరుద్ధరించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ కరికులమ్లో దీనిని మళ్లీ చేర్చింది. కన్నె పొర, దాని రకాలు; దాని వైద్యపరమైన, చట్టపరమైన ప్రాధాన్యం, కన్యత్వం, కన్నె పొర ఛేదన, లెజిటిమసీ, దాని మెడికో-లీగల్ ఇంపార్టెన్స్ అంశాలను కూడా తిరిగి చేర్చింది. వీటిని మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 2022లో పాఠ్య ప్రణాళిక నుంచి తొలగించారు.