Sleep Champion | బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి పాటిల్ ఎక్కువసేపు నిద్రపోవడం ద్వారా ‘స్లీప్ చాంపియన్’గా నిలిచి రూ. 9 లక్షలు గెలుచుకున్నారు. బెంగళూరు స్టార్టప్ ఇనిషియేటివ్ వేక్‌ఫిట్ వరుసగా మూడో సీజన్లోనూ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం’ నిర్వహించింది. పోటీదారులు ప్రతి రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. పోటీదారుల నిద్ర అలవాట్లను మెరుగుపరిచేందుకు, స్లీప్ చాంపియన్ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు స్లీప్ ఎక్స్‌పర్ట్స్‌తో వర్క్‌షాపులు కూడా వేక్‌ఫిట్ నిర్వహిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందిన ఓ వ్యక్తి (25) యూపీఎస్సీ కోచింగ్ ఫీజు కోసం నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు వెళ్లాడు. వర్షం పడుతున్నదని, ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలని ఓ మహిళను కోరాడు. ఆమె అంగీకరించడంతో ఆ ఇంట్లోకి వెళ్లాడు. ఆమె గదిలోకి వెళ్లి, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె ఎనిమిదేళ్ల కుమారుడిని తీసుకుని నిందితుడు పారిపోయాడు. బాలుడిని విడిచిపెట్టాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దేవరియాలో బాలుడిని గుర్తించారు.