Woman Lawyer | కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.10లక్షలు దోపిడీ
Woman Lawyer | కొందరు కేటుగాళ్లు కస్టమ్స్ అధికారులమంటూ (customs officers) బెంగళూరుకు చెందిన ఓ మహిళా న్యాయవాదిని (Bengaluru woman lawyer) బెదిరించి రూ.లక్షలు దోచుకున్నారు.
Woman Lawyer | దేశంలో ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చివరికి న్యాయ వృత్తిలో ఉన్న వాళ్లు కూడా స్కామ్‌ల ద్వారా నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా న్యాయవాదికి షాకింగ్ అనుభవం ఎదురైంది. కొందరు కేటుగాళ్లు కస్టమ్స్ అధికారులమంటూ (customs officers) బెంగళూరుకు చెందిన ఓ మహిళా న్యాయవాదిని (Bengaluru woman lawyer) బెదిరించి రూ.లక్షలు దోచుకున్నారు. నార్కోటిక్ టెస్టు పేరిట వీడియో కాల్లో ఆమెతో దుస్తులు తొలగింపజేసి వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సదరు బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 5న ముంబై శాఖ కస్టమ్స్ అధికారులమంటూ కొందరు వ్యక్తులు సదరు మహిళా న్యాయవాదికి వీడియో కాల్ చేశారు. ఆమె పేరిట సింగపూర్ నుంచి ఓ డ్రగ్స్ ప్యాకేజీ (drugs package) వచ్చిందని బెదిరించారు. నార్కోటిక్స్ టెస్టు (narcotics test) పేరిట వీడియో కాల్లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు.
ఆమె నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకపోతే వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బెదిరిపోయిన సదరు మహిళ చేసేదేమీ లేక నిందితులు కోరినట్టు నగదును ఆన్లైన్లో వారు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read..
Raj Thackeray | ఎన్డీయేకు బేషరతుగా మద్దతు ప్రకటించిన రాజ్ థాకరే
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

