Home
National
Bengaluru Vvip Culture Man Protests Governor Convoy Delay With Pregnant Wife Stuck In Traffic
గర్భిణి కంటే వీఐపీలు ఎక్కువనా?
గవర్నర్లు, సీఎంలు, మంత్రుల దర్జా వల్ల సామాన్యులు ఎంతలా ఇబ్బందిపడుతున్నారో చెప్పే ఘటన ఇది. వాళ్లు రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపేయడం వల్ల సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఆదివారం గవర్నర్ వస్తున్నారని ట్రాఫిక్‌ను అరగంటకు పైనే ఆపేశారు.
- ట్రాఫిక్ నిలిపివేయడంతో గవర్నర్ కాన్వాయ్ ముందు భర్త నిరసన
బెంగళూరు : గవర్నర్లు, సీఎంలు, మంత్రుల దర్జా వల్ల సామాన్యులు ఎంతలా ఇబ్బందిపడుతున్నారో చెప్పే ఘటన ఇది. వాళ్లు రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్‌ను గంటల తరబడి ఆపేయడం వల్ల సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఆదివారం గవర్నర్ వస్తున్నారని ట్రాఫిక్‌ను అరగంటకు పైనే ఆపేశారు. దీంతో ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించాడు.
ఆ వ్యక్తి గర్భవతి అయిన తన భార్యను అత్యవసర చికిత్స కోసం దవాఖానకి తీసుకెళ్తున్నాడు. గవర్నర్ కోసం ట్రాఫిక్ ఆపేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగాడు. దీంతో చేసేది లేక పోలీసులు వాహనాలను ఒక వైపు నుంచి వెళ్లనిచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వీఐపీ హోదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

