బెంగళూరు: కర్ణాటక పోలీస్ ఇన్స్పెక్టర్ గోవింద రాజు రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తుండగా, ఆయన పెద్ద పెట్టున కేకలు పెడుతూ, అరెస్ట్‌ను నిరోధించేందుకు ప్రయత్నించారు.
దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయనపై ఎండీ అక్బర్ ఫిర్యాదు మేరకు వల వేసి పట్టుకున్నట్లు లోకాయుక్త పోలీసులు తెలిపారు. ఒక కేసులో సాయపడటం కోసం అక్బర్‌ను గోవింద రాజు రూ.5 లక్షలు లంచం అడిగారని, తొలుత రూ.1 లక్ష లంచం తీసుకున్నారని, రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని లోకాయుక్త అధికారులు వెల్లడించారు.