బెంగళూరు, జూన్ 11 : కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు భద్రత కరువవుతున్నది. నగరంలోని మిల్టర్ పార్క్‌లో ఇద్దరు మహిళలపై ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. జూన్ 6న రాత్రి 7 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లిన తనను ఓ యువకుడు బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. కాసేపటికే మరో మహిళ పట్ల కూడా ఇదేవిధంగా ప్రవర్తించినట్టు కేసు నమోదైంది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.